WGL: గంజాయి రవాణా కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు క్రైమ్ ఏసీపీ సదయ్య తెలిపారు. 2025 సెప్టెంబర్లో ఖానపురం (M)లోని చిలకమ్మనగర్ శివారులో 763.845 కిలోల గంజాయిని రవాణా చేస్తుండగా వారిని పట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు.