WNP: గోపాల్ పేట మండల రైతులు తప్పనిసరి ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఏఈఓ శిరీష సూచించారు. తాడిపర్తి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇవాళ రిజిస్ట్రేషన్ చేపట్టనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, పంట బీమా ప్రయోజనాలు పొందాలంటే ఈ రిజిస్ట్రేషన్ అవసరమని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.