AP: సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘దూరదృష్టి అభివృద్ది పట్ల అంకితభావం.. ఇవే మీ నాయకత్వానికి ప్రతీక. రాష్ట్రాభివృద్దికి మీ నిరంతర కృషి.. ప్రతి ఒక్కరికీ ప్రేరణగా నిలుస్తోంది. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న మీ విజన్ దేశానికే ఆదర్శం. మీ నాయకత్వంలో రాష్ట్రం మరింత పురోగతి సాధించాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.