RR: సమాజంలో కుల వ్వవస్థను, వర్ణ భేదాలను, లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయ వాది మహాత్మ బసవేశ్వర మహారాజ్ అని శంకర్పల్లి మున్సిపల్ చైర్మన్ సాత ప్రవీణ్ కుమార్ అన్నారు. శంకర్పల్లిలో బసవేశ్వర మహారాజ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. వీరశైవ సమాజం సభ్యులు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.