MHBD: సీరోల్ మండలం ఉప్పరిగూడెంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ ఇస్లావత్ సుధాకర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, రైతు సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు, రైతులు పాల్గొన్నారు.