ADB: ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అమరవీరుల స్థూపానికి ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు గోడం నగేశ్ మాజీ ఎంపీ సోయం బాపూరావుతో కలిసి ఘన నివాళులర్పించారు. ఆదివాసీ ప్రజల హక్కుల కోసం తమ ప్రాణాలను విడిచిన అమరవీరుల త్యాగాలు మరువలేనివని అన్నారు. వారి ఆశయ సాధనకై ఉద్యమించాలని పిలుపునిచ్చారు.