SDPT :వేసవి కాలంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో, బాటసారుల దాహార్తిని తీర్చడానికి సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్ష రెడ్డి సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. జగదేవపూర్ మండల కేంద్రంలో ఇమ్మడి లక్ష్మీ – జహంగీర్ దంపతుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆమె ఈ రోజు అధికారికంగా ప్రారంభించారు.