కాకినాడలోని సౌజన్యనగర్లో శనివారం రాత్రి 10:30 సమయంలో గుర్తు తెలియని వ్యక్తి దొంగతనానికి ప్రయత్నించినట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు గమనించగానే ఆ వ్యక్తి గోడ దూకి అక్కడి నుంచి పారిపోయాడని సమాచారం. సంఘటన స్థలంలో ఆ వ్యక్తికి చెందిన టూవీలర్ స్కూటీ, మొబైల్ ఫోన్ లభించాయి. కాల్ సెంటర్కు సమాచారం ఇవ్వగానే వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు.