ADB: రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్ ఏఎస్పీగా ఉన్న పి.మౌనికను అదే జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్)గా నియమించారు. ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ అడిషనల్ ఎస్పీ (అడ్మిన్)గా, భైంసా ఏఎస్పీ రాజేష్ మీనా వనపర్తి అడిషనల్ ఎస్పీగా, నిర్మల్ ఏఎస్పీగా సాయిని బదిలీ చేశారు.