VZM: స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరాం ఆదివారం చీపురుపల్లి, రాజాం పట్టణాల్లో పర్యటించి పారిశుధ్య నిర్వహణ, వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలపై సమీక్ష నిర్వహించనున్నారు. చీపురుపల్లి ఎంపీడీవో కార్యాలయంలో స్థానిక అధికారులతో సమావేశమై స్వచ్ఛత కార్యక్రమాల అమలు, మౌలిక సదుపాయాల పురోగతిపై సమీక్ష చేస్తారు. అనంతరం రాజాం డంప్ యార్డ్‌ను సందర్శించనున్నారు.