NGKL: అమ్రాబాద్ మండలం వటవర్లపల్లిలో ఎక్సైజ్ అధికారులు శుక్రవారం భారీగా నల్లబెల్లాన్ని పట్టుకున్నారు. ఇన్స్పెక్టర్ కృష్ణయ్య ఆదేశాలతో సీఐ సతీశ్ బృందం తనిఖీలు చేపట్టి, 30 బ్యాగుల్లో ఉన్న 900 కేజీల నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎక్సైజ్ సిబ్బంది వెల్లడించారు.