NZB: సిరికొండ మండలం న్యావనందిలో సర్పంచ్ దీప నరేందర్ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సదుపాయాలు, ఉచిత పాఠ్యపుస్తకాలు, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, యూనిఫాం విషయాలపై అవగాహన కల్పించారు. అలాగే పాఠశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో బోధన జరుగుతోందన్నారు. పదో తరగతిలో 100% ఫలితాలు సాధించినట్లు చెప్పారు.