KRNL: పత్తికొండలో లోక్సత్తా కార్యాలయంలో కొత్త పింఛన్ల మంజూరుపై ఇవాళ సమావేశం జరిగింది. అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు వెంటనే పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పింఛన్ వయోపరిమితి తగ్గింపు, పెండింగ్ అంశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ నెల 29 కేబినెట్ సమావేశంలో స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.