RR: కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చందానగర్ హైవేపై బీజేపీ, బీజేవైఎం నాయకులు రాస్తారోకో చేపట్టారు. బీజేవైఎం ఉపాధ్యక్షురాలు సింధూరెడ్డి, అధికార ప్రతినిధి రవికుమార్ యాదవ్ నేతృత్వంలో నడిరోడ్డుపై బైఠాయించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కాంగ్రెస్ చేస్తున్న అన్యాయంపై కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు.