TG: రాజ్యాంగ సవరణ బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకించడాన్ని నిరసిస్తూ బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద ఆందోళనకు దిగారు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో వారిని పోలీసులు పీఎస్‌కు తరలించారు. మరోవైపు బీజేపీ నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉదయమే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావును హౌస్ అరెస్ట్ చేశారు.