SRPT: అనంతగిరి మండలం పాలవరం నుంచి అమీనాబాద్ గంగమ్మ గుడి వరకు రోడ్డు విస్తరణ పనులు నేటికీ ప్రారంభించలేదు. 2025 జనవరి 9న శంకుస్థాపన చేసినా,15 నెలలు గడుస్తున్నా నేటికీ పనులు ప్రారంభం కాలేదు. రహదారి అంతా గుంతలమయంగా మారి నిత్యం వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు పనులు పూర్తి చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.