NTR: తిరువూరు పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా జలధార–జల హారతిపై అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ప్రత్యేక అధికారి, ఆర్డీవో ఏ.కుమార్, మున్సిపల్ కమిషనర్ కె.మనోజతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.