AP: మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన పార్టీలకు డిపాజిట్లు కూడా రాకుండా చేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని CM చంద్రబాబు పేర్కొన్నారు. మహిళలను కించపరిచే విధంగా, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా విపక్షాలు చేసినది క్షమించరాని నేరమని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై నిడదవోలులో నిరసన ప్రారంభమేనని, మహిళల కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టంచేశారు. ఆడబిడ్డలను గౌరవించుకోవాలన్నారు.