నిర్మల్: ఈద్గాం చౌరస్తా వద్ద నెల రోజులుగా నెలకొన్న ట్రాఫిక్ సమస్యపై జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ సయ్యద్ అర్జుమాన్ ఆలీ స్పందించారు. వాహనాల రద్దీతో ప్రజలు, వాహనదారులు పడుతున్న ఇబ్బందులను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సమస్య తీవ్రతను జిల్లా ఎస్పీ జానకి షర్మిల దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరారు.