KMM: వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే రాందాస్ నాయక్ రేపు వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు ఇవాళ వెల్లడించారు. ఈ సమ్మేళనంలో పార్టీ సంసాగత విషయాలు పై చర్చించనున్నట్లు తెలిపారు. ఉదయం 9 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.