VKB: ముజాహిద్పూర్లో అక్కమ్మ చెరువులో శుక్రవారం సాయంత్రం ఈతకు వెళ్లిన యువకుడు గల్లంతైన ఘటనలో శనివారం గాలింపు చర్యలు కొనసాగాయి. ఈ క్రమంలో ఇవాళ ఉదయం స్థానిక పోలీసు అధికారులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టగా గల్లంతైన రామస్వామి మృతదేహం చెరువులో లభ్యమైంది. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.