KRNL: వెల్దుర్తి మండలం మాదాపురం, సూదేపల్లె అంగన్వాడీ కేంద్రాలలో ఇవాళ ‘పోషణ పక్వాడ్’ కార్యక్రమం నిర్వహించారు. ఏప్రిల్ 9 నుంచి 23 వరకు జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని సూపర్వైజర్ పద్మావతి ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల పోషణ, సమతుల్య ఆహారం, పిల్లల అభివృద్ధి దశలపై అవగాహన కల్పించారు.