బాపట్ల జిల్లాలో వాణిజ్య పన్నులు 100% వసూలు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో వాణిజ్య పన్నుల వార్షిక ప్రణాళికపై అనుబంధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.116.83 కోట్ల వాణిజ్య పన్నుల లక్ష్యాన్ని నిర్ణయించామని ఆయన తెలిపారు.