VZM: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో జిల్లా టాక్సీ డ్రైవర్లకి ఉపాధి కల్పించాలని లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం సాయంత్రం కె.ఎల్. పురం యూత్ హాస్టల్లో జరిగిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడారు. అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఉపాధి అంశాలు సీరియస్గా తీసుకోకపోతే జిల్లా యువత నష్టపోతారని అన్నారు.