TG: మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం భారత ప్రజాస్వామ్యానికి చీకటి రోజని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మండిపడ్డారు. 33 శాతం రిజర్వేషన్ల కలను కాంగ్రెస్, ఇండియా కూటమి ఓటు వేసి అడ్డుకున్నాయని ధ్వజమెత్తారు. మహిళల రాజకీయ హక్కులను కాలరాస్తూ, వారి సాధికారతకు విరుద్ధంగా వ్యవహరించిన కాంగ్రెస్ను దేశ మహిళలు ఎన్నటికీ క్షమించరని ఆయన హెచ్చరించారు.