మెదక్ జిల్లా రామాయంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో శుక్రవారం కాయకల్ప ఎక్స్టర్నల్ అసెస్మెంట్ నిర్వహించారు. రాష్ట్ర బృందం సభ్యులు డా. చంద్రకృష్ణ, డా. అభిషేక్, నర్సింగ్ ఆఫీసర్ ధర్మ ఆసుపత్రిలోని వైద్య సేవలు, పారిశుధ్యాన్ని పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు రోగులకు అందుతున్న వసతులపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.