PDPL: జిల్లాలోని ఎస్సీ యువతీ యువకుల ఉపాధి కోసం నిర్దేశించిన పాడి గేదెల పెంపకం దరఖాస్తు గడువు ఈ నెల 23 వరకు పొడిగించినట్లు జిల్లా ఎస్సీ అభివృద్ధి సహకార సంస్థ కార్య నిర్వహణ అధికారి శ్రావణ్ కుమార్ తెలిపారు. కనీసం 10 గుంటల వ్యవసాయ భూమి గలవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులను మున్సిపల్/ఎంపీడీవో కార్యాలయంలో గడువులోగా అందజేయాలన్నారు.