AP: తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో రేపు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఈ మేరకు అమరావతి నుంచి ఉదయం 10:30 గంటలకు సీఎం బయల్దేరతారు. 11:20 గంటలకు ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1:50 గంటలకు మలకోడు సరస్సును సందర్శించి స్థానికులు, శాస్త్రవేత్తలు, నిపుణులతో ముఖాముఖి నిర్వహించనున్నారు.