NRPT: ధన్వాడ మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో సర్పంచ్, ఉప సర్పంచ్ కొండయ్య, ఆంజనేయులు కలిసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని బాటసారులకు దాహార్తి తీర్చే విధంగా చలివేంద్రం ఎంత ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీను, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.