WGL: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అనవసర విమర్శలు చేస్తున్నాయని బీజేపీ జిల్లా నాయకుడు కుందూరు మహేందర్ రెడ్డి అన్నారు. వర్ధన్నపేట పట్టణంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ బిల్లుకు పార్లమెంటులో వివిధ పార్టీల పాత్రపై చర్చ జరిగిందని, బీజేపీ ఎంపీ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుని విమర్శలు చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.