తమిళ హీరో ఆర్య, దర్శకుడు పా.రంజిత్ కాంబినేషన్లో వచ్చిన ‘సార్పట్ట’ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా సీక్వెల్‌పై హీరో ఆర్య అప్డేట్ ఇచ్చాడు. ఈ ఏడాది జూన్ నుంచి ‘సార్పట్ట-2’ షూటింగ్ ప్రారంభం కానుందని వెల్లడించాడు. ఈ సినిమాలో మరోసారి బాక్సర్‌గా మెప్పించడం కోసం ఆర్య ఇప్పటికే కఠినమైన ఫిట్నెస్ శిక్షణను మొదలుపెట్టాడు.