SRCL: వేములవాడలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సాంకేతిక సమస్యలతో సర్వర్ పనిచేయక రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో రిజిస్ట్రేషన్ కోసం ముందుగానే స్లాట్ బుక్ చేసుకున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శుక్రవారం ఉదయం నుంచే కార్యాలయానికి పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజలు గంటల తరబడి వేచి చూసినా సర్వర్ సమస్య సమస్య పరిష్కారం కాలేదు.