NLG: ధర్వేశిపురంలో పోలీస్, 108 సిబ్బంది ఆధ్వర్యంలో రోడ్డు భద్రత, సీపీఆర్ ప్రాముఖ్యతపై అవగాహన సదస్సు నిర్వహించారు. గుండెపోటు వచ్చినప్పుడు ‘గోల్డెన్ అవర్’ లో సీపీఆర్ చేయడం ద్వారా ప్రాణాలను ఎలా కాపాడవచ్చో సిబ్బంది ప్రత్యక్షంగా చేసి చూపారు. ప్రాథమిక చికిత్సపై అవగాహన ఉంటే ప్రాణనష్టాన్ని నివారించవచ్చని సూచించారు. ఇందులో యువత, గ్రామస్థులు పాల్గొన్నారు.