ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ టీమ్ ఈవెంట్ ఉబెర్ కప్లో భారత అవకాశాలకు దెబ్బ పడింది. భారత డబుల్స్ జోడి పుల్లెల గాయత్రి – ట్రెసా జాలీ ఈ టోర్నీనుంచి తప్పుకుంది. ట్రెసా మడమకు గాయం కావడంతో టీమ్ మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. వీరి స్థానంలో భారత్కు ప్రాతినిధ్యం వహించేందుకు శ్రుతి మిశ్రా – ప్రియ కొంజెన్బమ్లను ఎంపిక చేశారు.