సౌతాఫ్రికాలోని డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మహిళల జట్టు ఓడిపోయింది. తొలి టీ20లో హర్మన్‌ప్రీత్ సేన 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ముందుగా భారత జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 157 రన్స్ చేసింది. లక్ష్యఛేదనలో వొల్వార్డ్(51), డెర్క్సెన్(44 నాటౌట్) సత్తాచాటడంతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఆదివారం రెండో టీ20 జరగనుంది.