PPM: జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలు, వృద్దుల పట్ల కుటుంబ సభ్యులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సూచించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ప్రతిఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వలన శరీరంలో నీటి శాతం తగ్గుతుందన్నారు, దాహంతో సంబంధం లేకుండా నీరు, మజ్జిగ, నిమ్మరసం తీసుకోవలన్నారు.