BDK: భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. సేల్స్, బ్యాంకింగ్, ఎలక్ట్రీషియన్ విభాగాల్లో ఖాళీలు ఉండగా ఎంపికైన వారికి రూ. 15,000 నుంచి రూ. 35,000 వరకు వేతనం లభిస్తుంది. 18-29 ఏళ్ల మధ్య ఉండి, పదో తరగతి నుంచి పీజీ, ఐటీఐ పూర్తి చేసిన వారు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు సర్టిఫికెట్లతో హాజరుకావాలని ప్రిన్సిపల్ కోరారు.