MHBD: వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న సారాయి, బెల్లం సరఫరా వాహనాలను ఏప్రిల్ 23న ఉదయం 11 గంటలకు మహబూబాబాద్ ఎక్సైజ్ స్టేషన్లో బహిరంగ వేలం పాట నిర్వహించనున్నట్లు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ జి. చిరంజీవి తెలిపారు. వేలంలో పాల్గొనాలనుకునేవారు వేలంకు ముందుగానే డిపాజిట్ చెల్లించాలన్నారు. మరిన్ని వివరాలకు ఎక్సైజ్ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.