HNK: పరకాలలోని పెట్రోల్ బంకుల్లో ఫైర్ సేఫ్టీపై ప్రజలు, పెట్రోల్ బంక్ సిబ్బందికి నేడు పరకాల ఫైర్ స్టేషన్ అధికారులు అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదాలు జరిగిన సమయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, అగ్ని ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని స్టేషన్ ఫైర్ ఆఫీసర్ భద్రయ్య అన్నారు. కార్యక్రమంలో కృష్ణ కుమార్, గణేష్, దిలీప్, రాజేంద్రప్రసాద్ ఉన్నారు.