అన్నమయ్య: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంగళవారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి దేవాదాయ శాఖ అధికారులు ఘన స్వాగతం పలికి, అమ్మవారి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం వేద పండితులు మంత్రికి వేద ఆశీర్వచనం అందజేశారు.