NRPT: టెన్త్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల సౌకర్యార్థం మార్కుల మెమోలను పాఠశాలల లాగిన్లో ఉన్నాయని నారాయణపేట డీఈవో గోవిందరాజు తెలిపారు. మార్చి 2026లో పరీక్షలు రాసిన విద్యార్థులు ఉన్నత చదువులో భాగంగా తదుపరి కోర్సుల్లో అడ్మిషన్లు పొందడానికి మెమోలు అవసరమని అన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఆన్లైన్లో ఉంచిన మెమోలను సంబంధిత పాఠశాల హెచ్ఎంలతో డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు.