BDK: అశ్వాపురం మండల కేంద్రంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని అధికారులు రాత్రికి రాత్రే తొలగించడంపై దళిత సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం R&B గెస్ట్ హౌస్ ఎదుట దళిత సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ,విగ్రహాన్ని యథాస్థానంలో పునః ప్రతిష్టించాలని డిమాండ్ చేశారు.