NGKL: కొల్లాపూర్ మండలం నార్లాపూర్ వద్ద కొనసాగుతున్న పాలమూరు రంగారెడ్డి రిజర్వాయర్‌కు సంబంధించి ప్యాకేజీ-3 పనులను ఎక్సైజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం ఉదయం పరిశీలించారు. సంబంధిత ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఎత్తిపోతల పథకం పనులను వేగవంతంగా చేపట్టాలని సూచించారు. ఆయన వెంట కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఉన్నారు.