TG: రైతుకు భరోసా ఇవ్వాలనే తాము యాత్ర చేస్తున్నామని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. 80 శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయని ప్రభుత్వం చెప్తున్నా.. క్షేత్రస్థాయిలో 25 శాతానికి మించి కొనుగోళ్లు జరగలేదన్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడిచిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్దప్రాతిపదికన కొనుగోళ్లు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.