కృష్ణా: అమరావతిని విజయవాడతో అనుసంధానించే సీడ్ యాక్సిస్ రహదారి నిర్మాణానికి అడ్డంకులు తొలగుతున్నాయి. ఉండవల్లికి చెందిన రైతులు ఎకరం 45.5 సెంట్ల భూమిని ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చేందుకు అంగీకరించారు. దీంతో రహదారి నిర్మాణ పనులు వేగం పుంజుకోనున్నాయి. త్వరలో పనులు ప్రారంభించి రోడ్డును అందుబాటులోకి తీసుకోస్తామని తెలియజేశారు.