W.G: జిల్లా మొగల్తూరు లోని గాంధీ బొమ్మ సెంటర్ ప్రాంతంలో దత్త సాయి మందిర నిర్వాహకులు మంగళవారం ప్రజలకు మజ్జిగను పంపిణీ చేశారు. గణపతి సచ్చిదానంద స్వామీజీ 84వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బాటసారి దాహార్తిని తీర్చేందుకు ప్రజలకు మజ్జిగనందించారు. మందిరం నిర్వాహకులు మోహన్ మాట్లాడుతూ.. స్వామివారి జన్మ దినోత్సవం ఘనంగా జరుపుతున్నట్లు తెలిపారు.