NTR: జిల్లా నందిగామలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 గంటలకే 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కంచికచర్ల, వీర్లపాడు, చందర్లపాడు మండలాల్లో 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పనులు ఉంటేనే బయటకు రావాలని, వడదెబ్బ బారిన పడకుండా మజ్జిగ, మంచినీరు, కొబ్బరి నీళ్లు ఎక్కువగా సేవించాలని వైద్యులు సూచిస్తున్నారు.