VZM: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపు, నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో నమోదు శాతం పెంచడం, డ్రాప్అవుట్లను తగ్గించడం లక్ష్యమని తెలిపారు.