AKP: అచ్యుతాపురం టీడీపీ కార్యాలయం వద్ద మంగళవారం పార్టీ జెండాను నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ‘నేను-నా జెండా- నా తెలుగుదేశం’ కార్యక్రమంలో భాగంగా జెండా ఎగరవేసినట్లు తెలిపారు. మహానాడు సందర్భాన్ని పురస్కరించుకుని టీడీపీ కార్యకర్తలు వారి ఇళ్లపై పార్టీ జెండాలను ఆవిష్కరించాలని పిలుపునిచ్చారు.