MDK: కౌడిపల్లి మండలం రాయిలాపూర్ తాండాకు చెందిన బొజ్జ నాయక్, శోభారాణిల ద్వితీయ కుమారుడు హలవత్ నవీన్ కుమార్ ఒకేసారి ఆరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి సంచలనం సృష్టించాడు. లభించిన ఆరు అవకాశాలలో.. అతడు ఎస్ఐసీ (LIC) లో ఏఏవో (AAO) గా చేరడానికి సిద్ధమయ్యాడు. భవిష్యత్తులో ఆర్బీఐలో గ్రేడ్ బి అధికారిగా స్థిరపడటమే తన లక్ష్యమని నవీన్ కుమార్ తెలిపాడు.